
మోత్కూరు ఆసుపత్రి బాత్రూంలో నల్లత్రాచు కలకలం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని బాత్రూంలోకి గురువారం నల్లత్రాచు పాము ప్రవేశించడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సిబ్బంది స్థానిక జంతు ప్రేమికుడు, పాస్టర్ కాపర్తి సైమన్కు సమాచారం అందించారు. ఆయన చాకచక్యంగా పామును పట్టుకుని అడవిలో వదిలిపెట్టారు. ప్రమాదం తప్పడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు సైమన్ను అభినందించారు.




























