పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించినట్లు ANI వెల్లడించింది. అయితే, అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా 'ప్రాంతీయ సమతుల్యత' పాటించాలనే షరతుతోనే ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయనున్నట్లు తెలిపింది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీ అవసరం కావడంతో, ఎన్డీఏ కూటమి ఇతర పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది.