TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ఈ మేరకు 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.