మహిళ ముక్కును కొరికిన యువతి

0చూసినవారు
మహిళ ముక్కును కొరికిన యువతి
బీహార్‌లోని పాట్నాలో ప్రేమ వ్యవహార వివాదం తీవ్రరూపం దాల్చింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్‌లో పంచాయితీ పెట్టింది. స్టేషన్ బయట ఇరువర్గాల మధ్య గొడవ జరగ్గా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆ యువతి రైల్వే ట్రాక్ వైపు పరుగులు తీసింది. ఆమెను అడ్డుకోబోయిన యువకుడి స్నేహితురాలిపై సదరు యువతి దాడి చేసి ముక్కు కొరికేసింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్