నిర్మల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక షాపింగ్ మాల్ పక్కన ఉన్న భవనంపైకి ఎక్కిన యువతి, చాలా సేపటి వరకు ఫోన్లో మాట్లాడుతూ గందరగోళానికి గురిచేసింది. ఆమెను కాపాడటానికి స్థానికులు ప్రయత్నించగా, పైకి వస్తే దూకేస్తానని హెచ్చరించింది. యువకులు భవనంపైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో, ఒక్కసారిగా కిందకు దూకేసింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, వెంటనే స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఎందుకు ఇలా చేసిందనే విషయాలపై విచారణ జరుగుతోంది.