హాస్టల్‌లో యువకుడి మృతి

48చూసినవారు
హాస్టల్‌లో యువకుడి మృతి
AP: నంద్యాల జిల్లా లలితా నగర్‌లో ఉన్న ఓ హాస్టల్‌లో యువకుడు మృతి చెందాడు. గది నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన హాస్టల్ యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు నెల్లూరు జిల్లా కోవూరుకు చెందిన సువర్ధన్ (27)గా గుర్తించారు. రెండు నెలల క్రితమే సువర్ధన్ బ్యాంక్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. హాస్టల్‌లో ఉంటూ బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవాడని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్