కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యువకుడి పాదయాత్ర (వీడియో)

1చూసినవారు
TG: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గురకొండకు చెందిన చిన్న నరసింహ వినూత్న రీతిలో తన మద్దతును తెలుపుతున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి తిరిగి విజయం సాధించాలని కోరుకుంటూ ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం వరకు పాదయాత్ర మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ యాత్ర జడ్చర్ల ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ.. రైతులు సాగునీరు, విద్యుత్, యూరియా కొరత వంటి సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్