
బుల్లితెరపై కేంద్ర మాజీ మంత్రి..ఎపిసోడ్ కు రూ.14 లక్షలు
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నటి స్మృతి ఇరానీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చారు. ఓ హిందీ సీరియల్ లో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ కోసం ఆమె ఒక్కో ఎపిసోడ్కు రూ.14 లక్షల వరకు పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 'బుల్లితెరపై అందరికంటే ఎక్కువ పారితోషికం పొందుతున్న నటిని నేనే' అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సీరియల్ రేటింగ్ ఆధారంగా నటీనటులకు అధిక పారితోషికాలు ఉండడం సహజం అన్నారు.















