
ఈ క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం: కార్తీ(వీడియో)
హీరో కార్తీ తన కెరీర్లో ‘సర్దార్-2’ చాలా ముఖ్యమైన సినిమా అని తెలిపారు. స్పై పాత్ర దొరకడం తన అదృష్టమని ‘సర్దార్-2’ ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పారు. కమల్ హాసన్కు ‘ఇండియన్’ లాగే తనకు ‘సర్దార్’ అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు కీలక పాత్రలు పోషించారని అన్నారు. మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 10న థియేటర్లలో విడుదల కానుంది.






























