
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ ప్రారంభం
యూఎస్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్, హైదరాబాద్‌లో 'ఇండియా సౌత్ సెంట్రల్' పేరుతో క్లౌడ్ రీజియన్‌ను సోమవారం ఢిల్లీలో జరిగిన 'మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్' సందర్భంగా అధికారికంగా ప్రారంభించింది. భారత్‌లో క్లౌడ్, ఏఐ రంగాల అభివృద్ధికి ప్రకటించిన 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడిలో భాగంగా ఈ డేటా సెంటర్ ఏర్పాటైంది. పుణె, చెన్నై, ముంబై తర్వాత ఇది దేశంలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన 4వ క్లౌడ్ రీజియన్. ఆసియా, గ్లోబల్ సౌత్ ప్రాంతాలకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.



































