
చెత్తకుప్పలో యువతి మృతదేహం (వీడియో)
పాట్నాలోని పునైచక్ రోడ్ నెం.3లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని చెత్తకుప్ప పక్కనే పడేశారు. ఈ దృశ్యం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.



































