
కరువు నివారణకు తెచ్చిన చెట్టు.. ఇప్పుడు శాపంగా మారిందా?
దాదాపు 150 ఏళ్ల క్రితం కరువు నివారణ కోసం బ్రిటిష్ పాలకులు భారతదేశానికి తీసుకొచ్చిన విదేశీ వృక్ష జాతి ప్రోసోపిస్ జులిఫ్లోరా ఇప్పుడు పర్యావరణానికి సవాలుగా మారింది. వేగంగా విస్తరిస్తూ స్థానిక మొక్కలను నాశనం చేయడం, భూగర్భ జలాలపై ప్రభావం చూపడం, గడ్డి భూములను ఆక్రమించడం వల్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో వేలాది కుటుంబాల జీవనోపాధికి ఈ చెట్టు ఇప్పటికీ ఆధారంగా ఉండటంతో ఈ చెట్టును పూర్తిగా తొలగించాలా లేక ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలా అనే దానిపై చర్చ కొనసాగుతోంది.



























