
చిన్నారి చికిత్సకు అండగా అనంత్ అంబానీ (video)
ముంబైలోని హెచ్.ఎన్. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో అరుదైన జన్యుపరమైన వ్యాధి (స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్-1)తో బాధపడుతున్న బాలుడు వేదాంశ్ కు అనంత్ అంబానీ పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నారు. కుటుంబానికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, అత్యుత్తమ వైద్యుల నియామకం, ప్రయాణ, వసతి, ఆహార ఏర్పాట్లను రిలయన్స్ ఫౌండేషన్ పర్యవేక్షిస్తోంది. నెదర్లాండ్స్ నుంచి వైద్య నివేదికలు రావాల్సి ఉంది, అవి అందిన తర్వాత జన్యు చికిత్స ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉంది.



































