
'తరంగ్ శక్తి' విన్యాసాల్లో అమెరికా F-35 యుద్ధ విమానాలు ఎంట్రీ
భారత్లో జరుగుతున్న ‘తరంగ్ శక్తి-2026’ వైమానిక విన్యాసాల్లో అమెరికా ఎఫ్-35ఏ లైట్నింగ్-2 స్టెల్త్ ఫైటర్ జెట్లు తొలిసారి పాల్గొన్నాయి. రాజస్థాన్లోని జోధ్పుర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ విన్యాసాలు అక్టోబర్ 12 వరకు జరగనున్నాయి. అమెరికాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ వాయుసేనలు పాల్గొంటున్నాయి. ఎఫ్-35ఏలోని స్టెల్త్, అధునాతన సెన్సార్లు, సమాచార భాగస్వామ్య సామర్థ్యాలతో భారత, మిత్ర దేశాల వాయుసేనలతో శిక్షణ ద్వారా సహకారం, సమన్వయం పెంచుకోవడమే లక్ష్యంగా విన్యాసాలు కొనసాగుతున్నాయి.



































