
టీడీపీ కంచుకోటలపై జనసేన, బీజేపీ ఫోకస్?
ఏపీలో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. నోటిఫికేషన్ వెలువడకముందే అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జనసేన, బీజేపీ మేజర్ మేయర్ సీట్లపై దృష్టి సారించాయి. విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఏలూరు వంటి కీలక స్థానాలను జనసేన, గుంటూరు, తిరుపతి, విశాఖపట్టణం మేయర్ సీట్లను బీజేపీ ఆశిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి, సీఎం చంద్రబాబు విమర్శలు వంటి కారణాలతో కూటమిలో బేరసారాల సామర్థ్యం పెరిగిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


































