
పిల్లల మెడ నొప్పి, భుజాల నొప్పులు: డాక్టర్ల హెచ్చరిక
పిల్లలు గంటల తరబడి మొబైల్ ఫోన్లు చూడటం వల్ల మెడనొప్పి, భుజాల నొప్పులు రావడంతో పాటు శరీర భంగిమ దెబ్బతింటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అక్టోబరు 16న ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్ న్యూరోసర్జన్ డాక్టర్ రణధీర్ కుమార్, హైటెక్ సిటీ కేర్ హాస్పిటల్స్ స్పైన్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ గోపరాజు ఈ సూచనలు చేశారు. పెద్దలు కూడా ఇంట్లో గంటల తరబడి ఫోన్లలో మునిగిపోవద్దని తెలిపారు.



































