
పంజాబ్‌ను డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారుస్తాం: అమిత్ షా (VIDEO)
పంజాబ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బుధవారం జలంధర్‌లో జరిగిన 'నషా ముక్త్ పంజాబ్ యాత్ర' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కృత్రిమ మత్తు పదార్థాల అమ్మకానికి అనుమతించిందని ఆరోపించారు. 2029 డిసెంబర్ 31లోపు పంజాబ్‌ను డ్రగ్స్ రహితంగా మారుస్తామని, కాశ్మీర్లో తీవ్రవాదాన్ని, దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించినట్లే డ్రగ్స్‌ను అంతం చేస్తామని తెలిపారు.



































