
ప్రజల తీర్పును బాధ్యతగా భావిస్తున్నాం: మంత్రి లోకేశ్
AP: ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలను భావిస్తున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిశాయని, ఇక అందరి దృష్టి ప్రజాసేవపైనే ఉండాలని సూచించారు. గెలిచిన నేతలంతా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.


































