
34% రిజర్వేషన్ల పేరుతో BCలను మోసం చేయలేరు: విజయసాయిరెడ్డి
AP: స్థానిక సంస్థలకు వైసీపీ, టీడీపీ ఎప్పుడూ సక్రమంగా నిధులు ఇవ్వలేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. నిధులు, అధికారాలు లేని స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. ఖాళీగా ఉన్న తమ నాయకులను సమాజంపైకి వదిలి స్థానిక దోపిడీ చేసేందుకు ఆ రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయని విమర్శించారు. 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చేశామని చెప్పి డ్రామాలాడుతూ బీసీలను కలకాలం మోసం చేయలేరని అన్నారు. జనాభా లెక్కలు వచ్చిన తర్వాత బీసీలు ఆ రెండు పార్టీలపై తిరగబడటం ఖాయమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.



































