
మోడల్ స్కూల్ విద్యార్థులకు జేఈఈ, నీట్ కోచింగ్
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం జాతీయ స్థాయి పోటీ పరీక్షల కోచింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించింది. గురువారం నాడు పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ దీనిపై ప్రకటన చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో 29 జిల్లాల్లో యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దీని కోసం రూ.3.73 కోట్లు మంజూరయ్యాయి. దీని ద్వారా ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్ పరీక్షలకు 3,920 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందనుంది.



































