
ఆస్కార్ బరిలో మరాఠి చిత్రం 'గోంధల్'
భారతదేశం నుంచి మరాఠి చిత్రం ‘గోంధల్’ ఆస్కార్ 2027 బరిలో నిలిచింది. వచ్చే ఏడాది అకాడమీ అవార్డులకు ఈ సినిమా అధికారికంగా ఎంట్రీ సాధించింది. సంతోష్ దవాష్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 99వ అకాడమీ అవార్డుల్లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగం’లో పోటీపడనుంది. ఆస్కార్ నామినేషన్ కోసం దేశవ్యాప్తంగా మొత్తం 33 సినిమాలు పోటీపడగా, ఈ థ్రిల్లర్ కథాంశానికి జ్యూరీ ప్యానెల్ జై కొట్టింది. అణచివేతకు గురైన నవవధువు కథ ఇది. 2027 మార్చి 14వ తేదీన లాస్ ఎంజెల్స్లో 99వ ఆస్కార్ వేడుకలు జరుగనున్నాయి.
































