
స్థానిక ఎన్నికల్లో జనసేన వాటా ఎంత?
AP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పార్టీల సీట్ల కేటాయింపు అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో ఎక్కువ సీట్ల కోసం పట్టుబడుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 35-40 శాతం సీట్లు కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సీట్ల సంఖ్య 20-25 శాతానికి పరిమితం కావొచ్చని సమాచారం. ఈ నెల 22న కాకినాడలో జరగనున్న జనసేన స్థానిక ఎన్నికల సమావేశంలో సీట్ల సర్దుబాటుపై పవన్ కళ్యాణ్ ప్రస్తావించే ఛాన్సుంది.



































