
హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. 12 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
TG: హైదరాబాద్లోని ఖైరతాబాద్ బడా గణేశ్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 12 నుంచి 24 వరకు నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు కానున్నాయి. వీవీ విగ్రహం, సైఫాబాద్, ఇక్బాల్ మినార్, నిరంకారి, నెక్లెస్ రోటరీ మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్, మాసాబ్ ట్యాంక్, కేసీపీ జంక్షన్, సెక్రటేరియట్ పరిసరాల్లో తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది. పార్కింగ్ కోసం రేస్ కోర్స్ రోడ్, ఎన్టీఆర్ ఘాట్, ఐమ్యాక్స్ పార్కింగ్ స్థలం, విశ్వేశ్వరయ్య భవన్ వంటి ప్రాంతాలను కేటాయించారు. ప్రయాణాల్లో సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626ను సంప్రదించవచ్చు.


































