
రేవంత్ వ్యూహం.. మౌనమే కేసీఆర్ అస్త్రం
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు మరింత వేడెక్కుతోంది. అసెంబ్లీ ఘటనలతో BRSను ఇరుకున పెట్టేందుకు సీఎం రేవంత్ వ్యూహాలు రచించగా.. కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటూ వాటికి స్పందించకుండా ముందుకు సాగుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నల్ల షర్టులతో అసెంబ్లీకి వచ్చిన BRS MLAలు, MLCలను గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడం, అనంతరం జరిగిన పరిణామాలతో ఆ పార్టీ అసెంబ్లీలో తాను లేవనెత్తాలనుకున్న ప్రజా సమస్యలపై పూర్తిస్థాయిలో పోరాడలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండటంతో ఇప్పటి నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్, BJP వ్యూహాలకు పదును పెడుతున్నాయి.



































