
సితార బ్యానర్లో ధనుష్ కొత్త చిత్రం (VIDEO)
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డి-56’ మధురైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. యువ దర్శకుడు తమిళరసన్ పచముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ వడివేలు, ఎస్.జె. సూర్య, విజయ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ప్రైమ్మార్క్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.






























