
తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో రానున్న ఏడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 7 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లి పక్కా భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించింది.



































