
NEET UG 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో MBBS సీట్లు పెరిగాయ్
నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సెలింగ్‌లో మెడికల్ సీట్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సీట్ల మ్యాట్రిక్స్‌ను సవరించి మూడు మెడికల్ కాలేజీల్లో 30 అదనపు MBBS సీట్లను చేర్చింది. అభ్యర్థులు ఈ సీట్లను రెండో విడత Choice Fillingలో ఎంపిక చేసుకోవచ్చు. NMC ఆమోదంతో దేశవ్యాప్తంగా మొత్తం MBBS సీట్ల సంఖ్య 1,36,939కి చేరింది. తెలంగాణలో 10,250, కర్ణాటకలో 15,395, ఉత్తరప్రదేశ్‌లో 14,000, తమిళనాడులో 13,999, మహారాష్ట్రలో 13,099 సీట్లు ఉన్నాయి.



































