
ఆరో రోజుకు చేరిన ‘సేవా సంకల్ప్ యాత్ర’ (VIDEO)
ప్రధాని నరేంద్ర మోదీ గారు 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్, తెలుగు యువత ఆధ్వర్యంలో తిరుమల నుంచి వారణాసి వరకు చేపట్టిన ‘సేవా సంకల్ప్ యాత్ర’ ఆరవ రోజుకు చేరుకుంది. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ మధ్యప్రదేశ్ మీదుగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసింది.



































