
ప్రభాస్ బర్త్డే స్పెషల్.. 'ఫౌజీ' గ్లింప్స్ విడుదల!
దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఫౌజీ'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ఫౌజీ నుంచి ప్రత్యేక గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2027 మార్చి మూడో వారంలో (మార్చి 18) విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రభాస్ నటిస్తున్న మరో చిత్రం 'స్పిరిట్' విడుదల తేదీపై ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ మూవీకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.



































