
ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ
AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు గురువారం అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీచక్ర అధిష్ఠాన దేవతగా కొలిచే లలితాదేవిని దర్శించుకుంటే సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అమ్మవారి ఉపాసన మనసులో సౌమ్యత్వాన్ని పెంచుతుందని నమ్ముతారు.



































