
కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను వైసీపీ అవమానిస్తోంది: మంత్రి నిమ్మల
AP: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని (అక్టోబర్ 5) ఘనంగా నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 111 మంది ఉపాధ్యాయులను మంత్రి నిమ్మల రామానాయుడు సత్కరించారు. డీఎస్సీ ద్వారా 2 లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కూడా డీఎస్సీ నిర్వహిస్తుందని తెలిపారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను వైసీపీ అవమానిస్తోందని విమర్శలు గుప్పించారు.



































