
ఇంట్లో ఈ వస్తువులుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖాయం!
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని ప్రత్యేక వస్తువులను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరిగి, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. వెండి నాణెం, గులాబీ మొక్క, లోహపు తాబేలు, పసుపు గడ్డ, గవ్వలు వంటివి ఇంట్లో ఉంచడం ద్వారా లక్ష్మీదేవి, చంద్రుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ వస్తువుల వల్ల ఆర్థిక, వృత్తిపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలు రావడమే కాకుండా, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని భావిస్తారు.



































