
ఏపీలో స్థానిక ఎన్నికలు..డైరెక్ట్ ఎలక్షన్స్పై కూటమి ప్లాన్ ఇదే!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్–అక్టోబర్ మధ్య నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని సుమారు 125 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మేయర్లు, చైర్మన్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. జిల్లా, మండల పరిషత్ చైర్మన్లకు కూడా ఇదే విధానాన్ని అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే అవిశ్వాస తీర్మానాలతో పదవి కోల్పోయే అవకాశం తగ్గి, ఐదేళ్ల పాటు పాలన కొనసాగించవచ్చన్నది కూటమి ప్లాన్. అయితే ప్రజలే నేరుగా ఎన్నుకోవడంతో విపక్ష అభ్యర్థులు గెలిచే అవకాశమూ ఉంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.



































