
టాటా పంచ్ ఈవీ ధరల పెంపు
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మైక్రో ఎస్యూవీలలో ఒకటైన టాటా పంచ్ ఈవీ ధరలను కంపెనీ పెంచుతున్నట్లు ప్రకటించింది. స్మార్ట్, స్మార్ట్+ (30kWh) వేరియంట్ల ధరలు రూ.10,000 పెరగ్గా, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ ఎస్ (40kWh) వేరియంట్ల ధరలు రూ.20,000 పెరిగాయి. ఈ ధరల పెంపు తర్వాత కొత్త రేట్లు రూ.9.79 లక్షల నుండి రూ.12.99 లక్షల మధ్య ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ 30kWh (355కిమీ రేంజ్) మరియు 40kWh (468కిమీ రేంజ్) బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది.



































