
మూడేళ్లు రాఖీ కట్టి.. నాలుగో ఏడాది భర్త ఫ్రెండ్తోనే జంప్
ఉత్తరప్రదేశ్లో రాఖీ బంధాన్ని అపహాస్యం చేసే ఘటన చర్చనీయాంశమైంది. ఈసా నగర్కు చెందిన ఓ మహిళ తన భర్త స్నేహితుడిని అన్నగా భావిస్తూ మూడేళ్లుగా రాఖీ కడుతూ వచ్చింది. అయితే తాజాగా అదే వ్యక్తితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నాచెల్లెళ్ల బంధానికి ఉన్న పవిత్రతను ఇలా అపహాస్యం చేయడం సరికాదంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సమాచారం.



































