
3 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్ల పెంపు.. హోమ్, కారు లోన్ EMIలు పెరుగుతాయ్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దాదాపు మూడున్నర ఏళ్ల తర్వాత రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి, 5.25% నుంచి 5.50%కి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు పెరిగి, EMIలు పెరుగుతాయి. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.



































