
ట్రంప్ భద్రతపై ఇరాన్ మీడియా వ్యంగ్యాస్త్రాలు
ఇరాన్ మీడియా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించింది. టర్కీలోని అంకారాలో నాటో సదస్సు ముగించుకుని తిరుగు ప్రయాణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి మరో చిన్న విమానంలోకి మార్చిన రహస్య ఆపరేషన్‌ను అపహాస్యం చేసింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు ఇరాన్ సైనిక శక్తికి భయపడుతున్నారనే సంకేతంగా చిత్రీకరించి, ట్రంప్ తాజా "స్కాండల్"గా అభివర్ణించింది.


































