వీసా-Visa

ఎగ్జామ్‌ హాల్‌లో ఫోన్‌తో దొరికిన ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య (VIDEO)

ముంబయిలోని ఐఐటీ బాంబే పవయీ క్యాంపస్‌లో 19 ఏళ్ల విద్యార్థి సాహిల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎనర్జీ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న అతడు ఇటీవల పరీక్ష హాల్‌లో మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తూ పట్టుబడ్డాడు. ప్రశ్నపత్రాన్ని చాట్‌జీపీటీలో అప్‌లోడ్‌ చేస్తూ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోయినా.. విభాగాధిపతి అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి హాస్టల్‌ గదిలో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఐఐటీ బాంబేలో ఇది నాలుగో మరణం కావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. Video Credit: ANI