
మిస్ యూనివర్స్ పోటీల కోసం ప్యూర్టోరికోకు పయనమైన కజియా
75వ మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు కజియా లిజ్ మెజో ప్యూర్టోరికోకు బయలుదేరారు. ఈ పోటీలు ప్యూర్టోరికోలోని శాన్ జువాన్లో జరగనుండగా, 2026 నవంబర్ 24న ఫైనల్స్ నిర్వహించనున్నారు. సాంప్రదాయ మెరూన్ రంగు చీరలో మెరిసిన కజియా, కిరీటాన్ని ధరించి విమానాశ్రయంలో కనిపించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కేరళ టైటిల్ గెలుచుకున్న కజియా, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై దేశం తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.






























