
ఢిల్లీలో కూలిన భవనం.. ఏడుగురు మృతి
ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఆదివారం (సెప్టెంబర్ 6) ఐదు అంతస్తుల పీజీ హాస్టల్ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 12 మందిని రక్షించారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ సంజీవ్ ఖిర్వార్ రాజీనామా చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన ఎంసీడీ కమిషనర్, అనధికారిక నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.




























