ఈరోజు వాతావరణం & రేపటి వాతావరణం - Weather Report

భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాన్

భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాన్

అక్టోబర్ 11న (ఆదివారం) భూమిని శక్తివంతమైన సౌర తుఫాన్ తాకనుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుడి నుంచి వెలువడిన రెండు భారీ ఉద్గారాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. వీటి ప్రభావంతో భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని, అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) మధ్యస్థ స్థాయి G2 జియోమాగ్నెటిక్ తుఫానుపై హెచ్చరిక జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావం ఉపగ్రహాలు, రేడియో సమాచార వ్యవస్థలు, నావిగేషన్ సేవలపై కొంతమేర ఉండవచ్చని అంచనా వేశారు.