நெய்வேலி - Neyveli

வீடியோஸ்


హైదరాబాద్
Jan 09, 2026, 17:01 IST/

యాచకుడి దాతృత్వం.. 500 దుప్పట్లు పంపిణీ

Jan 09, 2026, 17:01 IST
ఉత్తరాదిన చలిగాలులు వణికిస్తున్న వేళ, పఠాన్‌కోట్‌కు చెందిన దివ్యాంగుడైన రాజు అనే యాచకుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బుతో దాదాపు 500 దుప్పట్లను అవసరమైన వారికి పంపిణీ చేస్తున్నాడు. దుప్పట్లు పంచేందుకు ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, అక్కడికి వచ్చే వారికి టీ కూడా అందిస్తున్నాడు. గతంలో కొవిడ్‌-19 సమయంలో మాస్కులు ధరించాలని ప్రచారం చేసినందుకు, అలాగే అవసరమైన వారికి సరుకులు, చిన్నారులకు పుస్తకాలు అందించినందుకు ప్రధాని మోదీ కూడా 2020లో 'మన్ కీ బాత్' కార్యక్రమంలో రాజు సేవలను ప్రశంసించారు.