திட்டக்குடி - Thittakudi

வீடியோஸ்


హైదరాబాద్
Apr 11, 2026, 15:04 IST/ఖైరతాబాద్
ఖైరతాబాద్

పూలే వేడుకల్లో పిడి గుద్దులు గుద్దుకున్న ఇరు వర్గాల సభ్యులు

Apr 11, 2026, 15:04 IST
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో, కేటాయించిన నిధులలో గోల్మాల్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, జేరుపోతుల నరేంద్ర వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాల సభ్యులు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. బీసీ సంఘాల మధ్య సఖ్యత లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పూలే అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.