ధర్మపురి - Dharmapuri

வீடியோஸ்


జగిత్యాల జిల్లా
'జీవన్‌రెడ్డిని తక్కువగా చూడలేదు'
Apr 15, 2026, 01:04 IST/జగిత్యాల
జగిత్యాల

'జీవన్‌రెడ్డిని తక్కువగా చూడలేదు'

Apr 15, 2026, 01:04 IST
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తనను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని, గౌరవాన్ని తగ్గించలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయ భవిష్యత్తుపై హామీ ఇచ్చినా మొండి పట్టుదలతో కాంగ్రెస్‌ను వీడారని, వ్యక్తిగత ద్వేషంతోనే బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆరోపించారు. గతంలో టీపీసీసీ అధ్యక్ష పదవిని కోరుకున్నా, పార్టీ మద్దతుతో తనకు దక్కిందని, బీఆర్‌ఎస్‌పై పోరాడి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చానని, దీన్ని జీవన్‌రెడ్డి సహించలేకపోతే ఏం చేయాలని ప్రశ్నించారు. 2023 ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడ్డారని, లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని కోరినా, నిజామాబాద్ నుంచి టికెట్ ఇచ్చినా ఓటమిపాలయ్యారని, సొంత నియోజకవర్గంలోనూ ఓట్లు రాలేదని, దీనిపై జీవన్‌రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. దుర్మార్గుడైన కేసీఆర్‌తో జతకట్టి కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, కేవలం మంత్రి పదవి రాలేదనే కారణంతోనే పార్టీ మారుతున్నారని విమర్శించారు. పదవి రాకపోవడానికి పార్టీ కారణం కాదని, కేసీఆర్‌కు ఎలా జై కొడతారని ప్రశ్నించారు. పెద్ద నాయకులు వీడినా తాము కొనసాగుతామని నాయకులు స్పష్టం చేశారు.