கெங்கவல்லி - Gangavalli

வீடியோஸ்


రంగారెడ్డి జిల్లా
మహిళా ఎమ్మెల్యేల ఆస్తుల జాబితా.. అగ్రస్థానంలో ముగ్గురు ఏపీ నుంచే
Mar 09, 2026, 10:03 IST/

మహిళా ఎమ్మెల్యేల ఆస్తుల జాబితా.. అగ్రస్థానంలో ముగ్గురు ఏపీ నుంచే

Mar 09, 2026, 10:03 IST
దేశంలో మహిళా ప్రజాప్రతినిధుల ఆస్తుల జాబితాలో ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ.716.33 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి రెడ్డి రూ.388.10 కోట్లతో రెండో స్థానంలో, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి రూ.291.17 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 476 మంది మహిళా ప్రజాప్రతినిధుల్లో 14 మందికి వంద కోట్లకు పైగా ఆస్తి ఉంది. కాగా, తెలంగాణ మహిళా నేతల సగటు ఆస్తి రూ.14.45 కోట్లుగా నివేదిక వెల్లడించింది.