கடையநல்லூர் - Kadayanallur

పెద్దపల్లి జిల్లా
బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లకు కాంస్యాలు
Feb 08, 2026, 05:02 IST/

బాక్సింగ్ టోర్నీలో తెలంగాణ బాక్సర్లకు కాంస్యాలు

Feb 08, 2026, 05:02 IST
లా నూసియాలో జరిగిన బాక్సమ్‌ ఎలైట్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలంగాణ స్టార్ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్‌ కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన పురుషుల 60 కేజీల సెమీస్‌లో హుస్సాముద్దీన్‌ 0-5తో కెనడాకు చెందిన కియోమా అలీ అహ్మదియా చేతిలో ఓడిపోయారు. అలాగే, 55 కేజీల జాదుమణి సింగ్‌, 54 కేజీల హితేశ్‌ గులియా కూడా తమ సెమీఫైనల్స్‌లో ఓడి కాంస్య పతకాలు సాధించారు. మహిళల విభాగంలో, 75 కేజీల సెమీస్‌లో లవ్లీనా బోర్గోహైన్‌ గెలిచి ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రీతి పవార్, పూనమ్‌, మంజు రాణి, నీతూ గంగాస్‌, అరుంధతి చౌదరీ కూడా ఫైనల్లోకి అడుగుపెట్టారు.