Jun 29, 2026, 17:06 IST/రామగుండం
రామగుండం
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి..
Jun 29, 2026, 17:06 IST
పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశం మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ డి. విభాగ పర్యవేక్షకులు ఈశ్వర ప్రసాద్, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.