Nov 08, 2025, 12:11 IST/
నవంబర్ 21న 'ప్రేమంటే' సినిమా విడుదల
Nov 08, 2025, 12:11 IST
ఆనంది - ప్రియదర్శి నటించిన 'ప్రేమంటే' సినిమా ఈనెల 21న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా ఆనంది మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, టీజర్ కంటే రెండింతలు బాగుంటుందని అన్నారు. ప్రముఖ యాంకర్ 'సుమ' కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారని ఆమె షూటింగ్ లో సైలెంట్ గా ఉండేవారని తెలిపారు. 50 రోజుల్లోనే చిత్రీకరణ మొత్తం పూర్తయిందని రాత్రి పూటనే ఎక్కువ షూటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.