திருவெறும்பூர் - Thiruverumbur

வீடியோஸ்


నల్గొండ జిల్లా
కరెంటు కోతలకు చెక్.. త్వరలో జియో స్మార్ట్ ఇన్వర్టర్లు!
Feb 09, 2026, 05:02 IST/

కరెంటు కోతలకు చెక్.. త్వరలో జియో స్మార్ట్ ఇన్వర్టర్లు!

Feb 09, 2026, 05:02 IST
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో, ఇప్పుడు గృహ విద్యుత్ అవసరాలకు పరిష్కారం చూపనుంది. వేసవిలో కరెంటు కోతలు, ఉక్కపోతతో అల్లాడే ప్రజల కోసం మధ్యతరగతి బడ్జెట్‌కు తగినట్లుగా 'జియో స్మార్ట్ ఇన్వర్టర్ హోమ్ సిస్టమ్'ను తీసుకురావడానికి ముఖేష్ అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం ₹20,000-₹30,000 వరకు ఖర్చయ్యే ఇన్వర్టర్లు, బ్యాటరీలు జియో ద్వారా కేవలం ₹5,000-₹9,000 మధ్యలో లభించే అవకాశం ఉంది. ఇది విద్యుత్‌తో పాటు సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా ఛార్జ్ అవుతుంది. మొబైల్ యాప్ ద్వారా నియంత్రణ, పవర్ వినియోగ ట్రాకింగ్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ఈ కొత్త ఉత్పత్తితో జియో, లూమినస్, మైక్రోటెక్ వంటి ఇన్వర్టర్ దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.