Oct 10, 2025, 17:10 IST/
గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసన
Oct 10, 2025, 17:10 IST
గాజాలో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) సంస్థ చేపట్టిన ర్యాలీ పాకిస్తాన్‌లోని పలు కీలక నగరాల్లో హింసాత్మకంగా మారింది. లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్, క్వెట్టా వంటి నగరాల్లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇస్లామాబాద్‌లోని అమెరికా ఎంబసీని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. లాహోర్‌లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు నివేదికలున్నాయి.